దర్శనీయ స్థలాలుPlaces of Darshanदर्शनीय स्थल

శ్రీ క్షేత్ర శ్రీకామ్యపురంలోని తొమ్మిది పవిత్ర ప్రదేశాలుNine sacred places within Sri Kshetra Srikamyapuramश्री क्षेत्र श्रीकाम्यपुरम के नौ पवित्र स्थल

[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
01

గురు స్థానం — దక్షిణాముఖ జ్ఞాన సాగర దత్తాత్రేయ మందిరంGuru Sthanam — South-facing Jnana Sagara Dattatreya Templeगुरु स्थानम — दक्षिणाभिमुख ज्ञान सागर दत्तात्रेय मंदिर

2002లో ఆశ్రమం ప్రారంభమైన మొదటి ప్రదేశమే ఈ గురు స్థానం. ఇక్కడ దక్షిణాముఖుడైన జ్ఞాన సాగర దత్తాత్రేయ స్వామి కమలాసనంలో, దక్షిణాభిముఖంగా ఆసీనులై దర్శనమిస్తారు. దత్తాత్రేయ షోడశావతారాలలో ఒకటైన జ్ఞాన సాగర అవతారం ప్రకటమైన రోజుననే ఈ మందిరం ప్రతిష్ఠింపబడింది.The very spot where the ashram began in 2002, this is the most sacred Guru Sthanam. Here the south-facing Jnana Sagara Dattatreya Swami is seated in lotus posture, facing south as Dakshinamurti. The temple was consecrated on the very day marking his Jnana Sagara avatara — one of Dattatreya's sixteen avataras.2002 में जहाँ आश्रम आरंभ हुआ, वही यह परम पवित्र गुरु स्थानम है। यहाँ दक्षिणाभिमुख ज्ञान सागर दत्तात्रेय स्वामी कमलासन में, दक्षिण की ओर विराजमान दर्शन देते हैं। दत्तात्रेय के सोलह अवतारों में से एक ज्ञान सागर अवतार के प्रकट दिवस पर ही इस मंदिर की प्रतिष्ठा हुई।

ఈ మందిరంలోనే శ్రీచక్రం ప్రతిష్ఠించబడింది; కావున దత్తాత్రేయుడు అనఘా శక్తి సహితంగా కొలువై ఉంటాడు. ఇక్కడ తొమ్మిది పవిత్ర వృక్షాల కర్రలతో చేసిన నవదారు పాదుకలను, మహారాష్ట్రలో ఒక అపరిచిత భక్తుడు బహూకరించిన శ్రీ దత్తాత్రేయ సాలగ్రామ శిలా పాదుకలను భక్తులు స్వయంగా స్పృశించి నమస్కరించుకోవచ్చు.The Sri Chakra is also consecrated here, so Dattatreya abides together with Anagha Shakti. Devotees may behold — and personally touch — the Navadaru Paadukas made from nine sacred woods, and the Sri Dattatreya Salagrama stone paadukas gifted in 2025 by an unknown devotee in Maharashtra during a Datta-kshetra pilgrimage.यहीं श्रीचक्र भी प्रतिष्ठित है; अतः दत्तात्रेय अनघा शक्ति सहित विराजमान हैं। भक्त नौ पवित्र वृक्षों की लकड़ी से बनी नवदारु पादुकाएँ तथा 2025 में महाराष्ट्र में एक अपरिचित भक्त द्वारा भेंट की गई श्री दत्तात्रेय सालग्राम शिला पादुकाओं का स्पर्श कर नमन कर सकते हैं।

జ్ఞానం · ఆధ్యాత్మిక ఉన్నతిWisdom · Spiritual elevationज्ञान · आध्यात्मिक उन्नति
[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
02

పంచవటిPanchavatiपंचवटी

అశ్వత్థము, ఔదుంబరము, వటవృక్షము, బిల్వము, నింబము అనే ఐదు పవిత్ర వృక్షాల సమూహం ఇది. తూర్పు దిశగా ఎనిమిది దశాబ్దాల నాటి ఆరు పడగల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, కాశీ నుండి అప్రయత్నంగా వచ్చి కొలువైన నర్మదా బాణలింగం నందీశ్వర సహితంగా ఉన్నాయి.A grove of five sacred trees — Ashwattha, Audumbara, Vata, Bilva and Nimba. To the east stand an eight-decade-old six-hooded Subrahmanya Swami idol, and a Narmada Banalingam — which arrived from Kashi of its own accord — together with Nandishwara.अश्वत्थ, औदुम्बर, वट, बिल्व व निम्ब — इन पाँच पवित्र वृक्षों का समूह। पूर्व दिशा में आठ दशक पुरानी छह फणों वाली सुब्रह्मण्य स्वामी प्रतिमा तथा काशी से स्वतः आया नर्मदा बाणलिंग नंदीश्वर सहित विराजमान है।

పడమర వైపున జంట నాగులు, గాణగాపురంలోని రుద్రపాద తీర్థం నుండి తెచ్చిన శిలతో చేసిన పితృ దేవతా పాదుకలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇక్కడ చేసే ప్రదక్షిణల వలన నాగ దోషం, పితృ దోషాలు తొలగి, సంతాన సాఫల్యం, ఇష్ట కామ్యార్థ సిద్ధి కలుగుతాయి.To the west are twin Naga deities and Pitru Devata paadukas carved from stone brought from the Rudrapada Tirtham at Ganagapuram. Circumambulation here removes Naga dosha and Pitru dosha, blesses one with progeny, and fulfils cherished wishes.पश्चिम में युगल नाग तथा गाणगापुरम के रुद्रपाद तीर्थ से लाई शिला से बनी पितृ देवता पादुकाएँ प्रतिष्ठित हैं। यहाँ की प्रदक्षिणा से नाग दोष व पितृ दोष दूर होकर संतान सौख्य व इष्ट कामना सिद्धि प्राप्त होती है।

నాగ/పితృ దోష నివారణ · సంతాన సాఫల్యంRelief from Naga & Pitru dosha · Progenyनाग व पितृ दोष निवारण · संतान सौख्य
[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
03

ధ్యాన మందిరంDhyana Mandiramध्यान मंदिर

ఇది శ్రీశ్రీశ్రీ అనఘానంద స్వామి వారి వ్యక్తిగత సాధన కొరకు నిర్మించబడింది. ఇందులో ఒక భూగృహం కూడా ఉంటుంది. ఇతరులకు ప్రవేశం లేదు; కేవలం బయట నుండి మాత్రమే ఈ మందిరాన్ని వీక్షించవచ్చు.Built for the personal sadhana of Sri Sri Sri Anaghananda Swami, this shrine includes an underground chamber. Entry is not permitted; it may be viewed only from outside.यह श्री श्री श्री अनघानंद स्वामी की व्यक्तिगत साधना हेतु निर्मित है। इसमें एक भूगृह भी है। भीतर प्रवेश वर्जित है; इसे केवल बाहर से देखा जा सकता है।

గమనిక: శ్రీచక్ర సహిత దత్త మందిరం, పంచవటి, ధ్యాన మందిరం — ఈ మూడూ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.Note: the Sri Chakra Datta temple, Panchavati and Dhyana Mandiram all stand within one and the same courtyard.सूचना: श्रीचक्र सहित दत्त मंदिर, पंचवटी व ध्यान मंदिर — तीनों एक ही प्रांगण में हैं।

[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
04

ప్రధాన మందిరం — నవ గురుపాదుకా పీఠంMain Temple — Nava Guru Paaduka Peethamप्रधान मंदिर — नव गुरु पादुका पीठम

2008 గురు పౌర్ణమి నాడు ప్రారంభమైన ఈ మందిరంలో 2025 విజయదశమి వరకు సాయినాథుని మూర్తి మాత్రమే ఉండేది. ఇటీవల వేదిక రీమోడల్ చేసి శ్రీ దత్తాత్రేయ మహాసిద్ధ యంత్ర సహిత నవ గురుపాదుకా పీఠం ఆవిర్భవించింది — యావత్ ప్రపంచంలో మరెక్కడా లేని పీఠం ఇది.Opened on Guru Pournami 2008, the temple held only the Sainath murti until Vijayadashami 2025. The sanctum was then remodelled and the Sri Dattatreya Maha Siddha Yantra Nava Guru Paaduka Peetham emerged — a peetham unlike any other in the entire world.2008 गुरु पूर्णिमा को आरंभ हुए इस मंदिर में 2025 विजयदशमी तक केवल साईंनाथ की मूर्ति थी। हाल ही में वेदी का पुनर्निर्माण कर श्री दत्तात्रेय महासिद्ध यंत्र सहित नव गुरु पादुका पीठम स्थापित हुआ — समस्त विश्व में अद्वितीय पीठम।

శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రూపకల్పన చేసిన మహాసిద్ధ యంత్రం మధ్యలో; చుట్టూ తొమ్మిది గురుమూర్తులు — దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభ, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, షిరిడి సాయి, ఆచార్య భరద్వాజులు, వాసుదేవానంద సరస్వతి, జగద్గురు ఆదిశంకరులు కొలువై ఉన్నారు. వారి చుట్టూ తొమ్మిది ప్రసిద్ధ దత్త క్షేత్రాల శిలలతో చేసిన పాదుకలు ప్రతిష్ఠింపబడ్డాయి.At the centre is the Maha Siddha Yantra designed by Sri Sri Sri Vasudevananda Saraswati Swami; around it abide nine Guru-murtis — Dattatreya, Sripada Srivallabha, Narasimha Saraswati, Manikya Prabhu, Swami Samartha, Shirdi Sai, Acharya Bharadwaja, Vasudevananda Saraswati and Jagadguru Adi Shankara — surrounded by paadukas made from stones of nine renowned Datta kshetrams.केंद्र में श्री श्री श्री वासुदेवानंद सरस्वती स्वामी द्वारा रचित महासिद्ध यंत्र; चारों ओर नौ गुरु मूर्तियाँ — दत्तात्रेय, श्रीपाद श्रीवल्लभ, नरसिंह सरस्वती, माणिक्य प्रभु, स्वामी समर्थ, शिरडी साईं, आचार्य भारद्वाज, वासुदेवानंद सरस्वती व जगद्गुरु आदि शंकर विराजमान हैं। उनके चारों ओर नौ प्रसिद्ध दत्त क्षेत्रों की शिलाओं से बनी पादुकाएँ प्रतिष्ठित हैं।

పీఠం క్రింద అనేక పుణ్యక్షేత్రాల మృత్తికలు, శిలలు, భగవన్నామ లేఖన గ్రంథాలు నిక్షిప్తం; సిద్ధ యంత్రం దగ్గర నుండి అనేక నదీ జలాలను భూమిలోనికి పోసే ఏర్పాటు ఉంది. కనుక ఈ పీఠ దర్శనం ఏకకాలంలో అనేక తీర్థ క్షేత్ర దర్శన ఫలితాన్నిస్తుంది. తూర్పు భాగంలో నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు మొదలైనవి కొలువైన వేద పురాణ ఇతిహాస మందిరం ఉంది. ఇక్కడ ప్రతిరోజు నాలుగు వేళల ఆరతులు, సత్సంగం జరుగుతాయి; 250–300 మంది కూర్చోవచ్చు.Beneath the peetham lie sacred soils, stones and books of divine-name writing from many holy sites; waters of many rivers are channelled into the earth at the yantra. Thus its darshan yields the fruit of visiting many tirthas at once. To the east is the Veda-Purana-Itihasa shrine holding the four Vedas, Upanishads, eighteen Puranas and more. Four aratis and satsang are held here daily; it seats 250–300.पीठम के नीचे अनेक तीर्थों की मिट्टी, शिलाएँ व भगवन्नाम लेखन ग्रंथ निहित हैं; यंत्र के पास से अनेक नदियों का जल भूमि में प्रवाहित किया जाता है। अतः इसका दर्शन एक साथ अनेक तीर्थ दर्शन का फल देता है। पूर्व में चार वेद, उपनिषद, अष्टादश पुराण आदि से युक्त वेद-पुराण-इतिहास मंदिर है। यहाँ प्रतिदिन चार आरती व सत्संग होते हैं; 250–300 श्रद्धालु बैठ सकते हैं।

అనేక తీర్థ క్షేత్ర దర్శన ఫలంFruit of many tirthas in one darshanअनेक तीर्थ दर्शन का फल
[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
05

రథశాల · భరతమాత మందిరం · ధునిRatha Shala · Bharatamata Temple · Dhuniरथशाला · भारतमाता मंदिर · धूनी

ప్రధాన మందిరం చుట్టూ అదే ప్రాంగణంలో — నైరుతి మూలన రథశాల, వాయువ్య మూలన భరతమాత మందిరం, ఆగ్నేయం వైపు ధుని (అగ్నిహోత్రం) ఉన్నాయి. ప్రతి సంవత్సరం దత్త నవరాత్రుల చివరి రోజు అనఘాష్టమి నాడు రథోత్సవం జరుగుతుంది.Within the same courtyard around the main temple — the Ratha Shala (chariot house) to the south-west, the Bharatamata temple to the north-west, and the Dhuni (sacred fire / agnihotram) to the south-east. Each year the Rathotsavam is held on Anaghashtami, the final day of Datta Navaratri.प्रधान मंदिर के उसी प्रांगण में — नैऋत्य में रथशाला, वायव्य में भारतमाता मंदिर, आग्नेय में धूनी (अग्निहोत्र) हैं। प्रतिवर्ष दत्त नवरात्रि के अंतिम दिन अनघाष्टमी को रथोत्सव होता है।

"దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి అసంపూర్ణం" అన్న శ్రీ అనఘానందుల ప్రబోధానికి నిదర్శనంగా, అందమైన కృష్ణశిలతో మలచిన భరతమాత విగ్రహం దర్శనీయం. సిద్ధ యంత్రం వద్ద సంకల్పం, గురు స్థానంలో ధ్యానం, పంచవటిలో ప్రదక్షిణ, ధునిలో పూర్ణఫల సమర్పణ ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధి పొందవచ్చు.Embodying Sri Anaghananda's teaching that "devotion to God without love for the motherland, and love for the motherland without devotion to God, are both incomplete," a beautiful Bharatamata idol carved in black stone is enshrined here. Making a sankalpa at the Siddha Yantra, meditating at the Guru Sthanam, circumambulating Panchavati, and offering a coconut at the Dhuni fulfils one's heartfelt wishes."राष्ट्रभक्ति बिना ईश्वरभक्ति और ईश्वरभक्ति बिना राष्ट्रभक्ति अधूरे हैं" — श्री अनघानंद के इस उपदेश के प्रतीक रूप में कृष्णशिला से निर्मित सुंदर भारतमाता प्रतिमा दर्शनीय है। सिद्ध यंत्र पर संकल्प, गुरु स्थानम में ध्यान, पंचवटी में प्रदक्षिणा व धूनी में पूर्णफल अर्पण से इष्ट कामना सिद्ध होती है।

[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
06

అవధూత శ్రీ గోపాల్ బాబా గోశాలAvadhuta Sri Gopal Baba Goshalaअवधूत श्री गोपाल बाबा गोशाला

విద్యార్థి దశలో శ్రీ అనఘానంద స్వామి అవధూత శ్రీ గోపాల్ బాబాను దర్శించి సేవించారు. ఒకరోజు వారి పాద సేవ చేస్తూ, "ఇటువంటి మహనీయుని పాదస్పర్శ మన గ్రామానికి ఎప్పుడైనా లభిస్తుందా" అని అనుకున్నారు. ఊహించని రీతిలో గోపాల్ బాబా ఈ క్షేత్రానికి మూడుసార్లు వచ్చారు; మొదటి పుస్తకాన్ని ఆవిష్కరించారు; రథోత్సవంలో స్వయంగా పాల్గొన్నారు. సజీవ అవధూతకు జరిగిన ఆ రథోత్సవం 'న భూతో న భవిష్యతి'.As a student, Sri Anaghananda Swami served the Avadhuta Sri Gopal Baba. While massaging his feet one day, he wondered, "Will such a great soul's footsteps ever grace our village?" Unexpectedly, Gopal Baba visited this kshetram three times — releasing its first booklet and personally taking part in the Rathotsavam. A chariot festival for a living avadhuta — never before, never again.विद्यार्थी अवस्था में श्री अनघानंद स्वामी ने अवधूत श्री गोपाल बाबा की सेवा की। एक दिन उनके चरण सेवा करते हुए सोचा, "क्या ऐसे महापुरुष के चरण कभी हमारे गाँव को मिलेंगे?" अप्रत्याशित रूप से गोपाल बाबा इस क्षेत्र में तीन बार आए — प्रथम पुस्तिका का विमोचन किया व रथोत्सव में स्वयं सम्मिलित हुए। जीवित अवधूत के लिए वह रथोत्सव 'न भूतो न भविष्यति'।

అందుకు గుర్తుగా ఈ గోశాలకు "అవధూత శ్రీ గోపాల్ బాబా గోశాల" అని నామకరణం చేశారు; ఇది క్షేత్రంలోని వాయువ్య భాగంలో ఉంది. గోసేవ: గో సంరక్షణ, గోగ్రాసం కొరకు భక్తులు యథాశక్తి సహకరించవచ్చు; గోదానం చేయాలనుకునేవారికి కూడా మంచి అవకాశం ఉంది.In his memory the goshala is named "Avadhuta Sri Gopal Baba Goshala"; it stands in the north-west of the kshetram. Go-seva: devotees may contribute as they are able towards the care and feeding (go-grasam) of the cows; those wishing to perform go-danam (gifting a cow) are warmly welcomed.उनकी स्मृति में इस गोशाला का नाम "अवधूत श्री गोपाल बाबा गोशाला" रखा गया; यह क्षेत्र के वायव्य भाग में है। गोसेवा: भक्त गो संरक्षण व गोग्रास हेतु यथाशक्ति सहयोग कर सकते हैं; गोदान करने वालों के लिए भी सुंदर अवसर है।

గోసేవ · గోదానంGo-seva · Go-danamगोसेवा · गोदान
[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
07

అన్నపూర్ణాలయంAnnapurnalayamअन्नपूर्णालयम

పండుగలు, ఉత్సవాలు, ప్రతి ఆదివారం దత్త దర్బార్‌లో పాల్గొనే భక్తులకు, దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి అన్నప్రసాద వితరణ ఇక్కడే జరుగుతుంది. కొన్ని రోజులు బస చేయాలనుకునేవారికి వసతి కూడా ఇక్కడే; ప్రధాన మందిరం నుండి ఇక్కడికి వెళ్లే దారిలో హోమశాల ఉంది.Free anna-prasadam is served here to devotees who join festivals, celebrations and the Datta Darbar every Sunday, and to those who come from afar. Accommodation for those wishing to stay a few days is also here; a Homa Shala lies on the path from the main temple.पर्व, उत्सव व प्रत्येक रविवार के दत्त दरबार में सम्मिलित भक्तों तथा दूरस्थ श्रद्धालुओं को यहीं अन्नप्रसाद वितरण होता है। कुछ दिन ठहरने वालों के लिए आवास भी यहीं है; प्रधान मंदिर से यहाँ आने के मार्ग पर होमशाला है।

ఆధ్యాత్మిక ఉన్నతి కోరేవారు ఈ పవిత్ర, ప్రశాంత క్షేత్రంలో కొన్ని రోజులు ఉండి సేవా సాధన చేసుకోవచ్చు; స్వయంగా వంట కూడా చేసుకోవచ్చు. పెద్ద వరండాలో ఎంతమందైనా హాయిగా ప్రసాదం స్వీకరించవచ్చు. అన్నదాన మహిమ: పెండ్లి రోజు, పుట్టినరోజు, ఇష్టమైన పర్వదినాల్లో, శుభకార్యాల సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం ఎంతో పుణ్యఫలాన్నిస్తుంది.Seekers of spiritual progress may stay a few days in this pure, peaceful kshetram for seva and sadhana, and may even cook for themselves. The large verandah seats any number of devotees in comfort. The glory of anna-danam: offering meals here on birthdays, wedding days, beloved festivals and family celebrations bestows great merit.आध्यात्मिक उन्नति के इच्छुक इस पवित्र, शांत क्षेत्र में कुछ दिन रहकर सेवा-साधना कर सकते हैं; स्वयं भोजन भी बना सकते हैं। विशाल बरामदे में चाहे जितने भक्त सुखपूर्वक प्रसाद ग्रहण कर सकते हैं। अन्नदान महिमा: जन्मदिन, विवाह दिवस, प्रिय पर्वों व शुभ अवसरों पर यहाँ अन्नदान महान पुण्यफल देता है।

అన్నదానం · వసతి · సేవా సాధనAnna-danam · Stay · Seva-sadhanaअन्नदान · आवास · सेवा-साधना
[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
08

లెండివనంLendivanamलेंडीवनम

ఆశ్రమ ప్రాంగణంలో దాదాపు ఒకటిన్నర ఎకరాల స్థలంలో ఈ లెండివనం ఉంది. ఇందులో "నవగ్రహ నక్షత్ర రాశి వనం" — ఒక్కొక్క నక్షత్రానికి, గ్రహానికి, రాశికి సంబంధించిన ఒక్కొక్క చెట్టు ఉన్నాయి. మామిడి, పనస, సపోటా, కొబ్బరి, అరటి, సీతాఫలం, శ్రీ చందనం, ఎర్రచందనం, ఉసిరి, కదంబ తదితర అనేక వృక్షాలు ఉన్నాయి. చివరి భాగంలో గోవులకు కావలసిన గ్రాసం కూడా పెంచుతారు.Spread over about one and a half acres in the ashram grounds, the Lendivanam holds the "Navagraha Nakshatra Rashi Vanam" — a dedicated tree for each star (nakshatra), planet (graha) and zodiac sign (rashi). It is filled with mango, jackfruit, sapota, coconut, banana, custard-apple, sandalwood, red-sandalwood, gooseberry, kadamba and many more. Fodder for the cows is grown at its far end.आश्रम प्रांगण में लगभग डेढ़ एकड़ में फैला यह लेंडीवनम "नवग्रह नक्षत्र राशि वनम" समेटे है — प्रत्येक नक्षत्र, ग्रह व राशि हेतु एक-एक वृक्ष। आम, कटहल, चीकू, नारियल, केला, सीताफल, चंदन, रक्तचंदन, आँवला, कदंब आदि अनेक वृक्ष हैं। अंतिम भाग में गायों हेतु चारा भी उगाया जाता है।

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారు ఇక్కడ వన ప్రదక్షిణ చేస్తారు. భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు స్వామివారితో పాటు అనేక విషయాలు ముచ్చటిస్తూ వన ప్రదక్షిణ చేయడం ఒక మధురానుభూతి. ఇక్కడి ఔషధ వృక్షాల గాలిని పీల్చి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.Every morning and evening Swami performs a vana-pradakshina (circumambulation of the grove). When devotees visit, walking the grove alongside Swami while conversing on many subjects is a sweet experience. Breathing the air of these medicinal trees also restores health.प्रतिदिन प्रातः व सायं स्वामी यहाँ वन प्रदक्षिणा करते हैं। दर्शनार्थी भक्तों के लिए स्वामी के संग अनेक विषयों पर वार्तालाप करते हुए वन प्रदक्षिणा एक मधुर अनुभूति है। यहाँ की औषधीय वृक्षों की वायु से स्वास्थ्य लाभ भी होता है।

నవగ్రహ నక్షత్ర రాశి వనంNavagraha-Nakshatra-Rashi groveनवग्रह-नक्षत्र-राशि वन
[ఫోటో ఇక్కడ చేర్చండి][ Add photo here ][ चित्र यहाँ जोड़ें ]
09

సంగమంSangamamसंगमम

ప్రసిద్ధ దత్త క్షేత్రమైన గాణగాపురంలో మందిరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో భీమా-అమరజా సంగమం ఉన్నట్లే, మన శ్రీ క్షేత్ర శ్రీకామ్యపురంలో కూడా మూడు-నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశగా అడవిలో రెండు కాలువల సంగమం ఉండడం విశేషం.Just as the famed Datta kshetram of Ganagapuram has the Bhima–Amaraja sangamam four kilometres from its temple, our Sri Kshetra Srikamyapuram remarkably has a confluence of two streams, three to four kilometres to the north-east, within the forest.जैसे प्रसिद्ध दत्त क्षेत्र गाणगापुरम में मंदिर से चार किलोमीटर दूर भीमा-अमरजा संगम है, वैसे ही हमारे श्री क्षेत्र श्रीकाम्यपुरम में भी तीन-चार किलोमीटर दूर ईशान दिशा में वन के भीतर दो जलधाराओं का संगम है।

ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో స్వామివారి ఆధ్వర్యంలో అనేకమంది భక్తులు సంగమానికి వెళ్లి పవిత్ర స్నానమాచరించి, గురుపాదుకా పూజ చేసి వస్తారు. ప్రకృతి మాత ఒడిలో కుటుంబ సభ్యులందరితో కలిసి సేద తీరడం ఆహ్లాదకరం. యాత్ర చివరిలో రెండు కాలువలు కలిసే చోట చేసే దీపోత్సవం కనులవిందుగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ కార్యక్రమంలో పాల్గొనండి.Each Kartika month, under Swami's guidance, many devotees journey to the sangamam for a holy bath and guru-paaduka puja. Resting in the lap of Mother Nature with one's whole family is delightful. The Deepotsavam at the confluence at the journey's end is a feast for the eyes. Do take part at least once in your life.प्रत्येक कार्तिक मास में स्वामी के मार्गदर्शन में अनेक भक्त संगम जाकर पवित्र स्नान व गुरु पादुका पूजा करते हैं। प्रकृति माँ की गोद में सपरिवार विश्राम आनंददायक है। यात्रा के अंत में संगम पर दीपोत्सव नयनाभिराम होता है। जीवन में एक बार अवश्य इसमें सम्मिलित हों।

కార్తీక మాస సంగమ యాత్ర · దీపోత్సవంKartika sangama yatra · Deepotsavamकार्तिक संगम यात्रा · दीपोत्सव

ఈ పుణ్య క్షేత్రాన్ని త్వరగా దర్శించండిCome, Behold This Sacred Kshetramइस पुण्य क्षेत्र के शीघ्र दर्शन करें

చేరుకునే మార్గంPlan Your Visitपहुँचने का मार्ग